
లాహోర్: ఆసియా కప్‌లో ముందుకెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ రెడీ అయ్యింది. ఆదివారం గ్రూప్–బిలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లా.. అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. లంకతో జరిగిన తొలి పోరులో బంగ్లా ఓడింది. ఆ మ్యాచ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో మినహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లా పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టనుంది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ షకీబ్ పెర్ఫామెన్స్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానుంది.