ఆసియా కప్ 2023 సమరం.. జట్లు, షెడ్యూల్ పూర్తి వివరాలివే

 ఆసియా కప్ 2023 సమరం.. జట్లు, షెడ్యూల్ పూర్తి వివరాలివే

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఆసియాకప్‌ 2023 పోరు ప్రారంభం కానుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరిగే నేపాల్‌ vs పాకిస్థాన్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 17న జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది.

వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా.. ఈసారి వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.  నేపాల్‌ జట్టు తొలిసారి ఆసియాకప్‌ అర్హత సాధించడంతో.. పాల్గొనే మొత్తం జట్ల సంఖ్య 6కి చేరింది. పాకిస్తాన్‌, నేపాల్‌, భారత్‌ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ గ్రూపు-బిలో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 13 మ్యాచులు జరగనుండగా.. పాక్ గడ్డపై 4, శ్రీలంక గడ్డపై 9 నిర్వహించనున్నారు. పాక్ మ్యాచ్‌లు వారి సొంతగడ్డపై జరగనుండగా.. భారత్ ఆడబోయే మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి.

ఆసియా కప్ 2023 షెడ్యూల్

  • ఆగస్టు 30: పాకిస్తాన్ vs నేపాల్, ముల్తాన్ (పాకిస్తాన్)
  • ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక, కాండీ (శ్రీలంక)
  • సెప్టెంబర్ 2: ఇండియా vs పాకిస్తాన్, కాండీ (శ్రీలంక)
  • సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs అఫ్ఘనిస్తాన్, లాహోర్ (పాకిస్తాన్)
  • సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్ క్యాండీ (శ్రీలంక)
  • సెప్టెంబర్ 5: అఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక లాహోర్ (పాకిస్తాన్) 

సూపర్‌-4 స్టేజ్‌

  • సెప్టెంబర్ 6: A1 vs B2, లాహోర్ (పాకిస్తాన్)
  • సెప్టెంబర్ 9: B1 vs B2, కొలంబో (శ్రీలంక)
  • సెప్టెంబర్ 10: A1 vs A2, కొలంబో (శ్రీలంక)
  • సెప్టెంబర్ 12: A2 vs B1, కొలంబో (శ్రీలంక)
  • సెప్టెంబర్ 14: A1 vs B1, కొలంబో (శ్రీలంక)
  • సెప్టెంబర్ 15: A2 vs B2, కొలంబో (శ్రీలంక)
  • సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో (శ్రీలంక)

ఆసియా కప్‌ 2023 జట్లు

టీమిండియా: రోహిత్‌ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.

స్టాండ్‌ బై ప్లేయర్: సంజూ శాంసన్‌.

పాకిస్తాన్‌: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్‌ రవూఫ్‌, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది.

బంగ్లాదేశ్‌: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్‌ హుసేన్‌, మహ్మద్ నయీమ్

స్టాండ్‌ బై ప్లేయర్స్: తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్‌ హసన్ సకీబ్.

నేపాల్‌: రోహిత్ పౌడెల్(కెప్టెన్), మహమ్మద్ ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కెసి, గుల్షన్ కుమార్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, ప్రతిష్ జిసి, కిషోర్ మహతో , అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్, సుదీప్‌ జోరా.

అఫ్గనిస్తాన్‌: హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, రియాజ్ హసన్, ఇక్రమ్ అలీ ఖిల్, గుల్బుదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, రషీద్ ఖాన్, షఫ్రుద్దీన్ ఉర్ రహ్ అష్రఫ్, సులిమాన్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్.

శ్రీలంక: ఆసియా కప్‌ టోర్నీకి శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించాల్సి ఉంది.

Also Read :- సయీకి ఏం తక్కువ?

మ్యాచ్‌ల ఆరంభ సమయం

పాకిస్తాన్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు, శ్రీలంక వేదికగా జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష ప్రసారాలు

టీవీలో అయితే  స్టార్‌ స్పోర్ట్స్-1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ సెలక్ట్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ సెలక్ట్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 2, స్టార్‌ స్పోర్ట్స్‌ 2 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌' తమిళ్‌ఛానళ్లలో మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. అదే డిజిటల్‌ గా చూడాలనుకున్నవారు డిస్నీ+హాట్‌స్టార్‌(వమొబైల్‌ యాప్‌)లో ఉచితంగా చూడవచ్చు.