కోహ్లీ ప్రియ శత్రువుకు ఆసియా కప్‌లో దక్కని చోటు.. ఫ్యాన్స్ నిరాశ

కోహ్లీ ప్రియ శత్రువుకు ఆసియా కప్‌లో దక్కని చోటు.. ఫ్యాన్స్ నిరాశ

'విరాట్‌ కోహ్లీ vs నవీనుల్‌ హక్‌' ఐపీఎల్ 2023 సీజన్ లో వీరి మధ్య జరిగిన మాటల యద్ధం అందరకీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి  కోహ్లీ- గంభీర్ గొడవ పెద్దగా అనిపించినా.. అది మొదలైంది మాత్రం కోహ్లీ- నవీనుల్‌ మధ్యనే. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో ఇదే చర్చ సాగింది. ఇరు జట్లకు చెందిన అభిమానులు కూడా పోటాపోటీగా కామెంట్లు, మీమ్స్‌తో నెట్టింట హల్‌చల్‌ చేశారు. 

కోహ్లీ తన షూ చూపిస్తూ తిట్టడం నవీనుల్‌కు ఆగ్రహం తెప్పించడం. ఆ విషయాన్ని అంతటితో వదలని అతను గంభీర్‌కు ఫిర్యాదు చేయటం.. ఆపై గంభీర్ మైదానంలో కోహ్లీతో వాదనకు దిగటం. అబ్బో పెద్ద యుద్ధమే జరిగింది. ఆరోజు నుంచి కోహ్లి- నవీనుల్‌ హక్‌ మధ్య ఎప్పుడు బ్యాట్, బాల్ ఫైట్ జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్‌లో అది ఖాయమని అనుకున్నా.. అనూహ్యంగా అతనికి ఆఫ్ఘనిస్థాన్ జట్టులో చోటు దక్కలేదు.

17 మందితో ఆఫ్ఘన్ జట్టు

ఆదివారం 17 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఇందులో నవీనుల్‌ హక్‌ లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఒకవేళ నవీన్ జట్టులో ఉండుంటే.. ఖచ్చితంగా ఇండియా vs అఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసేవారిమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

స్పందించిన నవీనుల్‌ హక్‌

కాగా, ఆసియా కప్ ఆప్ఘన్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై నవీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. "అంధకారంలో మీ కళ్లను ఎంత పెద్దవిగా చేసి చూసినా.. మీకు వెలుతురు మాత్రం కనిపించదు.." అనే క్యాప్షన్‌తో ఓ పోస్ట్ పెట్టాడు.

ఆసియాకప్‌కు అఫ్ఘనిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, రియాజ్ హసన్, ఇక్రమ్ అలీ ఖిల్, గుల్బుదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, రషీద్ ఖాన్, షఫ్రుద్దీన్ ఉర్ రహ్ అష్రఫ్, సులిమాన్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్.