ఆసియా ఎలైట్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లోకి శివ థాపా

ఆసియా ఎలైట్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లోకి శివ థాపా

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌ శివ థాపా.. ఆసియా ఎలైట్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ 63.5 కేజీ సెమీస్‌‌‌‌ బౌట్‌‌‌‌లో శివ 4–-1తో బకోదుర్‌‌‌‌ ఉస్మానోవ్‌‌‌‌ (తజకిస్తాన్‌‌‌‌)పై నెగ్గాడు. గాయం వల్ల సెమీస్‌‌‌‌ బౌట్‌‌‌‌ నుంచి వైదొలిగిన తెలంగాణ స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌ (57 కేజీ) బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. 

క్వార్టర్స్‌‌‌‌ బౌట్‌‌‌‌ సందర్భంగా తెలంగాణ బాక్సర్‌‌‌‌కు కుడి కన్ను పైభాగంలో గాయమైంది. మెన్స్‌‌‌‌ 48 కేజీ సెమీస్‌‌‌‌లో గోవింద్‌‌‌‌ 0–4తో సాంజర్‌‌‌‌ తాష్కెన్‌‌‌‌బే (కజకిస్తాన్‌‌‌‌) చేతిలో, 75 కేజీ బౌట్‌‌‌‌లో సుమిత్‌‌‌‌ 0–5తో ఆసియా చాంపియన్‌‌‌‌ జఫరోవ్‌‌‌‌ సాయిజమ్‌‌‌‌షిడ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) చేతిలో ఓడి బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను సాధించారు. కాగా, విమెన్స్​లో లవ్లీనా సహా ఐదుగురు బాక్సర్లు ఇప్పటికే ఫైనల్​ చేరారు. ​