పిల్లలకు చైనాలో నో ఎంట్రీ : టోర్నీ నుంచి తప్పుకున్న మహిళా క్రికెటర్

పిల్లలకు చైనాలో నో ఎంట్రీ : టోర్నీ నుంచి తప్పుకున్న మహిళా క్రికెటర్

ఆసియా క్రీడల్లో వరుసగా మూడో సారి స్వర్ణం సాధించాలన్న పాక్‍కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీకి అథ్లెట్లు తమ పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడంతో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ టోర్నీ నుండి తప్పకుంది. దీంతో ఆల్ రౌండర్ కెప్టెన్ నిదా దార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయం తీసుకుంది. 

మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును పీసీబీ మంగళవారం ప్రకటించింది . "పిల్లలను తీసుకురాడదుకు అన్న నిబంధన కారణంగా.. పాక్  జట్టు బిస్మా మరూఫ్ సేవలను జట్టు కోల్పోయిందని మహిళా క్రికెట్ హెడ్ తానియా మల్లిక్ మీడియాకు వెల్లడించారు.

పాక్ మహిళా జట్టుకు రెండు స్వర్ణాలు

2010 గ్వాంగ్‌జౌ(చైనా)లో, 2014 ఇంచియాన్‌(దక్షిణ కొరియా)లో జరిగిన గత రెండు ఎడిషన్‌లలో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకాలు సాధించింది. ఈసారి ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈసారి భారత జట్టుదే స్వర్ణం

2010, 2014 ఎడిషన్‌లలో భారత జట్టు పాల్గొనలేదు. ఇది పాక్ జట్టుకు కలిసొచ్చింది. అయితే ఈసారి భారత జట్టు బరిలోకి దిగుతుండటంతో వారికి నిరాశ తప్పకపోవచ్చు. హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టును ఆసియన్ దేశాల మహిళా జట్లకు అంత తేలిక కాదు. ఈ టోర్నీకి భారత మహిళా జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

సెప్టెంబర్ 23 నుండి హాంగ్‌జౌ వేదికగా ఆసియన్ గేమ్స్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆసియా గేమ్స్‌కు పాకిస్తాన్ జట్టు: నిదా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, అనూషా నాసిర్, డయానా బేగ్, ఫాతిమా సనా, మునీబా అలీ, నజిహా అల్వీ, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, ఉమామ్ ఈ హనీ.