
అహ్మదాబాద్: టైల్స్ కంపెనీ.. ఏషియన్ గ్రానిటో లిమిటెడ్ (ఏజీఎల్) త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద టైల్స్ షోరూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇండియా టైల్స్ హబ్ అయిన గుజరాత్‌లోని మోర్బిలోని దీనిని నిర్మిస్తుంది. ఈ షోరూం 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరిస్తుంది. ఇక్కడే ఏజీల్ ప్రొడక్షన్ యూనిట్ కూడా ఉంటుంది. శానిటరీ వేర్, బాత్‌వేర్, ఇంజినీర్డ్ మార్బుల్, క్వార్ట్జ్ రేంజ్‌లతో పాటు 5 వేలకు పైగా రకాల టైల్స్ ఇక్కడ లభిస్తాయి. ఈ ఐదంస్తుల బిల్డింగ్‌కు 15వ తేదీన భూమి పూజ జరుగుతుంది.