ఆసిఫాబాద్ వ్యవసాయ అధికారి ..శ్రీనివాస్ రావుపై సస్పెన్షన్ వేటు

ఆసిఫాబాద్ వ్యవసాయ అధికారి ..శ్రీనివాస్ రావుపై సస్పెన్షన్ వేటు
  • యూరియా పంపిణీని పర్యవేక్షించకపోవడంపై చర్యలు

హైదరాబాద్‌, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి (ఇన్‌చార్జ్‌)గా పనిచేస్తున్న అసిస్టెంట్​అగ్రికల్చర్​ డైరెక్టర్​ ఆర్‌. శ్రీనివాస్‌రావును సస్పెండ్‌ చేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్​ డాక్టర్​ గోపీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో యూరియా పంపిణీని పర్యవేక్షించక పోవడం, యూరియా రాకపోకలను జిల్లా పరిపాలనకు తెలియజేయడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ వ్యవహారంపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్‌ రావును ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సస్పెండ్‌ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ తన ఉత్తర్వుల్లో  పేర్కొంది. సస్పెన్షన్‌ కాలంలో ఆయన ప్రధాన కార్యాలయం ఆసిఫాబాద్‌గా ఉండాలని, పై అధికారుల అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.