వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

 వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో వాంకిడిలోని జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ గురువారంతో ముగియగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించిందని తెలిపారు. 

విద్యార్థులు వేసవి సెలవుల్లో ఇంట్లో ఉంటూ టీవీ, మొబైల్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అందుకే ప్రభుత్వం వేసవి శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. శిబిరంలో టీచర్లు, వలంటీర్లు నేర్పించిన అంశాలను విద్యార్థులు పాటించాలన్నారు. డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, స్పోర్ట్స్, సంగీతం నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందన్నారు.