రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రూప్స్​ కొలువు

రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రూప్స్​ కొలువు

టీజీపీఎస్సీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 అయిదు లక్షల మందికి పైగా పోటీ పడే పరీక్ష. లక్షల మంది తమ కలల కొలువు దక్కించుకునేందుకు ఎంతో కాలం గా అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నెలలు కృషి చేసినా..  పరీక్షకు ముందున్న ఈ సమయంలో రివిజన్​ చేయకుంటే పరీక్షలో ప్రశ్నలు తెలిసినట్లే ఉన్నా సమాధానం గుర్తించడంలో పొరపాటు చేస్తాం. నెలరోజుల ముందు నుంచి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు సరిగా రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే గ్రూప్​ 2 కొలువుకు మరింత చేరువవుతాం. ఈ నేపథ్యంలో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 పరీక్షలో విజయం సాధించేందుకు రివిజన్​లో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం...

మొత్తం నాలుగు పేపర్లుగా ఉండే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 పరీక్షలు ఆగస్టు7, 8వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది. అంటే.. ఇప్పటినుంచి సుమారుగా 45 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఎంతో విలువైన ఈ సమయంలో ముఖ్యాంశాల రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనుసరించాల్సిన వ్యూహంపై అభ్యర్థులు పూర్తి స్పష్టతతో వ్యవహరించాలి.

కొత్త పుస్తకాల జోలికొద్దు:  ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఇప్పటి వరకు చదివిన అంశాల అవలోకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయా అంశాలకు నిర్దిష్టంగా సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రస్తుతం కొత్త పుస్తకాల జోలికి వెళ్లడం సరికాదు. ఇప్పటివరకు చదివిన అంశాలను నిర్వచనం మొదలు తాజా పరిణామాల వరకూ వేగంగా రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. 

కామన్​ టాపిక్స్​పై ఫోకస్​:  ప్రస్తుత సమయంలో..ఆయా పేపర్లలో ఉన్న కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏకకాలంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్, ఇండియన్​ పాలిటీ, పరిపాలన, ఎకానమీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ఇప్పటినుంచి ప్రతిరోజు కనీసం 10 గంటలు చదివేలా ప్లాన్​ చేసుకోవాలి. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో అభ్యర్థులు కష్టంగా భావించి కొన్ని టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చదవకుండా పక్కనపెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైన టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. దీంతోపాటు సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, ఎకానమీ, ఇంగ్లీష్, రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులు కూడా ఎక్కువ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి.

సొంత నోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో మేలు: అభ్యర్థులు ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేయాలి.

గవర్నమెంట్​ పాలసీలు: అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తాజా విధానాలు, పథకాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మహిళా సాధికారత వంటివి. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, ఎస్సీలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చారు. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డి­మాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వివిధ పాఠ్యాంశాలకు అనుగుణంగా పాఠశాల పుస్తకాలు, విశ్వవిద్యాలయాల పుస్తకాలు, ప్రభుత్వ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లను ప్రధాన వనరులుగా పరిగణించాలి. అయితే ఆయా పుస్తకాల్లో వర్తమాన అంశాలను జోడించారా లేదా అనేది చూసుకోవాలి.

పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 స్కోరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సింది పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4. ఇది గరిష్టంగా స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అవకాశమున్న పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014) దశగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ.. జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరచిన అంశాలు చూసుకోవాలి.

మాక్​ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో లోపాలు తెలుస్తాయ్​: ప్రస్తుత సమయంలో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 అభ్యర్థులు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తమకు ఇప్పటివరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. 
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం:  ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయనే భ్రమలో నుంచి బయటకు రావాలి. మంచి ఆహారంతో పాటు యోగా, వ్యాయామం లాంటివి ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పరీక్ష ముందు రోజు కూడా అర్థరాత్రి వరకూ చదువుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా కంటి నిండా నిద్రకు సమయం కేటాయించాలి.

తెలంగాణపై ‘స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆయా రాజ వంశాలు, శాసనా­లు, గ్రంథాలు, ముఖ్యమైన యుద్ధాలు, కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. 

దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం-విస్తీర్ణం, జనాభా వంటి వాటిపైనా అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు- ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టు సాధించాలి.

పాటించాల్సిన రూల్స్​..  

బేసిక్స్​ మీద పట్టు పెంచుకుంటే  కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నల సాధనలో అవి ఉపయోగపడుతాయి. ప్రాంతీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. యూపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ మార్గదర్శకాల కారణంగా ప్రతి పరీక్షలోనూ ప్రాంతీయ విషయాలపై  కనీసం 25 శాతం ప్రశ్నలు ఉంటున్నాయి. ఆ నేపథ్యంలో తెలంగాణ జాగ్రఫీ, చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సామాజిక సంబంధిత అంశాలు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆయా అంశాల్లో ఏదైనా బలహీనత ఉందేమో గుర్తించి రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరిచేసుకోవాలి. ఇప్పుడే మాక్​ టెస్టులు రాస్తే ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో అంచనా వేసుకొని, దాని మీద ఎక్కువ ఫోకస్​ చేయవచ్చు. 

పరీక్షకు వారం ముందు మాక్​ టెస్టులు రాస్తే తీవ్ర ఒత్తిడితో నష్టపోయే అవకాశం ఉంటుంది. పరీక్షలను రాసి లోపాల్ని పరిష్కరించుకునే పద్ధతిని ఈ రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలోనే చేయాలి. కనీసం ఏడాది కాలం నుంచి ఉన్న వర్తమాన అంశాలపై దృష్టి పెట్టి ఒకసారి రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. కేవలం జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధిత కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, భౌగోళిక కోణాల్లో అంతర్జాతీయ, జాతీయ,  ప్రాంతీయ నేపథ్యాలతో రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి. ఇప్పటివరకూ చదివిన పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం కావాలి. కొత్త పుస్తకాలు తీసుకుని అధ్యయనం చేయటం ఈ దశలో సరైన నిర్ణయం కాదు. వీలైనంతగా సోషల్​ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో అధ్యయనం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. రివిజన్​ టైమ్​లో శారీరక, మానసిక, ఆర్థిక అవరోధాలు సానుకూలంగా ఎదుర్కొవాలి.