అమర జవాన్లను ప్రతిపక్షాలు అవమానిస్తున్నయ్

అమర జవాన్లను ప్రతిపక్షాలు అవమానిస్తున్నయ్

సర్జికల్ స్ట్రైక్స్ పై నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తప్పుబట్టారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు నాడు అమరులైన సైనికులను అవమానిస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబానికి తమ విధేయతను చాటుకోవడంలో కాంగ్రెస్ తో సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు. తాము దేశం పట్ల విధేయతతో ఉంటామని, మన సైనిక బలగాలను ప్రశ్నించే వాళ్లను వదలబోమని చెప్పారు.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తయింది. 2019 ఫిబ్రవరి 14న పాక్ ఉగ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత నాడు మన ఆర్మీ పాకిస్థాన్ భూభాగంలో ప్రవేశించి.. అక్కడి టెర్రరిస్టు క్యాంపులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చింది. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానాలు ఉన్నాయని, నిజంగా చేసినట్లు ఆధారాలు చూపించాలని గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని నిన్నటి ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ సమర్థించారు. రాహుల్ అడిగిన దాంట్లో తప్పేంలేదని, తనకూ సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేంద్రం దానిపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే  సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తప్పుబట్టారు. ఇది అమర సైనికుల త్యాగాలను అవమానించడమేనని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

శ్రీవారి భక్తులకు శుభవార్త

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

జాతరలో చికెన్, మటన్, మందు అన్నీ పిరమే