అసోంలో వరద విలయం

అసోంలో వరద విలయం

అసోం లో వరదల  బీభత్సం కంటిన్యూ  అవుతోంది. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో...  గడిచిన 24 గంటల్లో  10 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి  చెందిన వారి  సంఖ్య 120కి చేసింది.  వరద ప్రభావం  ఎక్కువగా ఉన్న  చచార్ జిల్లాలోని సిల్చార్  ప్రాంతం వారం  రోజులుగా వరద  నీటిలోనే ఉంది.  అటు వరద నీటిలో  చిక్కుకున్న వారిని రక్షించేందుకు  సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. IAF,  NDRF  బృందాలు ఆహార పొట్టాలు, మంచినీటి  ప్యాకెట్లు  అందజేస్తున్నారు. మూడు లక్షల  మంది వరద  ముంపులోనే చిక్కకున్నారు.  అసోంలో 35 జిల్లాలు  ఉంటే, 30 జిల్లాలు  వరదల్లోనే చిక్కకున్నాయి.