అస్సాం మరో కశ్మీర్‌ కాకుండా చూడాలె

అస్సాం మరో కశ్మీర్‌ కాకుండా చూడాలె

గుహవటి: అస్సాం మరో జమ్మూ కశ్మీర్‌లా మారకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిస్వా శర్మ అన్నారు. ఓ ప్రత్యేక కమ్యూనిటీతో హిందువులకు ముప్పు పొంచి ఉందని, వారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)దేనని బిస్వా చెప్పారు. సిల్చార్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మారుమూల ప్రాంతాల్లోనూ ఆర్ఎస్ఎస్ విస్తరించి ఉందని, కాబట్టి హిందువులను సంరక్షించాల్సిన బాధ్యత సంఘ్ మీదే ఉందని స్పష్టం చేశారు.