
ఇటీవలే అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో రూ.2 వేల కోట్ల విలువైన స్టాక్ ట్రేడింగ్ స్కామ్ ని పోలీసులు బట్టబయలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ స్కామ్ లో విశాల్ ఫుకాన్ అనే వ్యాపారవేత్తని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందులో భాగంగా అస్సాం కి చెందిన ప్రముఖ సినీ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. దాంతో ఈ దంపతులను విచారణకి హాజరవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఖాతరు చెయ్యలేదు.
దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ప్టెంబర్ 11వ తారీఖున సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తొందర్లోనే స్టాక్ ట్రేడింగ్ స్కామ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అయితే నటి సుమి బోరా రాఘవ్ అనే హిందీ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు చిత్రాలకి కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది.
Also Read :- కొత్త కాన్సెప్ట్‌తో కళింగ.. ప్రీమియర్ షోస్ తో పాజిటివ్ టాక్
ఇంతకీ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ వ్యవహారం ఏమిటంటే అస్సాం కి చెందిన విశాల్ ఫుకాన్ అనే వ్యక్తి తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అతికొద్ది సమయంలో రెట్టింపు చేస్తానని నమ్మబలికి ఇతరుల దగ్గర దాదాపుగా వేలకోట్ల రూపాయలు వసూలు చేసాడు. తీరా లాభాలు చూపించే విషయంలో అవకతవకలు జరగడంతో పెట్టుబడిదారులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.