అవినీతి కేసులో లేడీ సింగం అరెస్టు

అవినీతి కేసులో లేడీ సింగం అరెస్టు

అస్సాంలో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో కాబోయే భర్త రానా పొగాగ్‌ను అరెస్టు చేసి వార్తల్లో నిలిచింది సబ్-ఇన్‌స్పెక్టర్ రభా. దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. అయితే రభా తరుపునే కాబోయే భర్త డబ్బులు వసూలు చేశారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. అసోంలోని నాగావ్‌ జిల్లాలో రభాను రెండు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాతే అరెస్టు చేశారు.

మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని కొందరిని మోసం చేశారంటూ పోగాగ్‌పై రభా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి మజూలి జైలుకి తరలించారు. 

 

మరిన్ని వార్తల కోసం.. 

పర్యావరణ పరిరక్షణ కోసమే స్వచ్ఛ భారత్