అసెంబ్లీ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు

అసెంబ్లీ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని సుమంత్ అన్నారు.  హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగకపోవడం బాధకరమని చెప్పారు. అనంతరం హీరో ఎన్టీఆర్‌ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి ఆయన జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు వేశారు.  

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్‌లో ఓటు వేశారు. ఓటేయడమే ముఖ్యం.. ఓటేయకుంటే ప్రశ్నించే హక్కు లేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వికాస్ రాజ్ S.R నగర్ లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఉదయం 7 గంటల నుండి తాము చాలా ప్రదేశాలలో కూడా పొడవైన క్యూలను చూస్తున్నామని, పోలింగ్ చురుగ్గా సాగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థించారు.

ఇక జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త పద్మశ్రీ ఎంఎం కీరవాణి.. ఈ రోజు సెలవు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.