ఆలయాలను దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్

ఆలయాలను దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్

అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయాలకు చేరుకున్న స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈవో  పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర సామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ విశిష్టతను అర్చకులు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. పూలమాల శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్యే సన్మానం 

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శనానికి వచ్చిన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం హరిత టూరిజం హోటల్లో ఆయనను పూలమాల శాలువాతో సన్మానించారు. అనంతరం అలంపూర్ విశిష్టతను, నియోజకవర్గ పరిస్థితులను ఆయనకు వివరించారు.