సెప్టెంబర్ 1న భూమి దగ్గరగా రాబోతున్న గ్రహశకలం

సెప్టెంబర్ 1న భూమి దగ్గరగా రాబోతున్న గ్రహశకలం

సెప్టెంబర్ 1 మంగళవారం ఒక గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది. ES4 అని పిలువబడే ఈ గ్రహశకలం 22 నుండి 49 మీటర్ల మధ్య వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గ్రహశకలం భూమిని తాకుతున్నట్లుగా దగ్గరగా వెళ్తుంది. కానీ, వాస్తవానికి భూమిని తాకదు. ఇది భూమికి కనీసం 45,000 మైళ్ళ దూరం (792,000 ఫుట్‌బాల్ మైదానాలు) నుంచి వెళ్తుంది అని నాసా ఆస్టరాయిడ్ వాచ్ శనివారం ట్వీట్ చేసింది.

నాసా ఈ గ్రహశకలం యొక్క సాపేక్ష వేగాన్ని అంచనా వేసింది. ఇది సెకనుకు 8.16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. చివరిసారిగా ఈ గ్రహశకలం భూమి దగ్గరగా వెళ్తూ కనిపించింది. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని కంటే దగ్గరగా వెళ్తుందని నాసా తెలిపింది. ఈసారి ఈ గ్రహశకలం భూమికి 1.2 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని నాసా తెలిపింది.

ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో చేర్చబడిన ఈ గ్రహశకలం మొట్టమొదటిసారిగా 2011లో కనుగొనబడింది. అందుకే దీనికి ES4 2011 అనే పేరు పెట్టారు. ఈ గ్రహశకలం ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి భూమి గుండా వెళుతుంది.

For More News..

పండుగలను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలి

అనుమతుల కోసం రామ్ మందిర్ లేఅవుట్