
లాహోర్:పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. క్వెట్టా వెళ్తున్న అక్బర్ ఎక్స్‌ప్రెస్ సాధిఖాబాద్‌లోని వాల్హర్ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును గుద్దడంతో 16 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 80 మంది గాయపడ్డారు. చనిపోయినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మెయిన్ ట్రాక్‌పై వెళ్లాల్సిన అక్బర్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ తప్పుగా ఇవ్వటంతో లూప్ ట్రాక్‌పైకి వచ్చి.. ఆగి ఉన్న గూడ్స్ రైలును గుద్దుకుందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, మూడు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో హైడ్రాలిక్ కట్టర్‌లు, మిషన్లను ఉపయోగించారు. సమాచారం తెలిసిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని రైల్వే మంత్రిని ఆదేశించానని ట్వీట్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశించామని రైల్వే మినిస్టర్ రహీద్ అహ్మద్ చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.