స్కూల్ హాస్టల్ లో 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి

స్కూల్ హాస్టల్ లో 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
  • 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
  •  గయానాలోని స్కూల్ హాస్టల్​లో ప్రమాదం
  • పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలు

జార్జ్ టౌన్: గయానాలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది పిల్లలు చనిపోయారు. పదుల సంఖ్యలో స్టూడెంట్లు గాయపడ్డారు. రాజధాని జార్జ్ టౌన్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదియా పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ‘‘ఈ ఘోర అగ్ని ప్రమాదంలో పసివాళ్లను కోల్పోయాం. గాయపడిన స్టూడెంట్లను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నం. తీవ్రంగా గాయపడిన వారిని రాజధానికి ఎయిర్ లిఫ్ట్  చేశాం” అని అధికారులు తెలిపారు. మృతులు, బాధిత పిల్లలు 12 నుంచి 18 ఏండ్ల వయసు వారని జాతీయ భద్రతా సలహాదారు గెరాల్డ్ గోవియా వెల్లడించారు. ‘‘సీరియస్ గాయాలైన వారిని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎయిర్ లిఫ్ట్ చేశారంటూ పైలట్లను మెచ్చుకున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పిల్లలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశాయి” అని గెరాల్డ్  వివరించారు.