
న్యూఢిల్లీ: సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మందిరంలోని భక్తులతో కలసి మోడీ భజన చేశారు. తంబూరెన్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ను వాయిస్తూ భక్తుల్లో ఆయన జోష్ నింపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022
గురు రవిదాస్ స్ఫూర్తి ప్రతీ అడుగులో, ప్రతీ పథకంలో ఉందని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పంజాబ్ ఎన్నికలు వాస్తవంగా ఈ నెల 16న జరగాల్సింది. కానీ రవిదాస్ జయంతి నేపథ్యంలో భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సర్కారు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని కోరింది. దీంతో సీఈసీ ఈ నెల 20వ తేదీకి పోలింగ్ ను వాయిదా వేసింది. ఇకపోతే, సంత్ రవిదాస్ 15–16వ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన బోధించిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారు.
మరిన్ని వార్తల కోసం: