ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

పేట, మాస్టర్ లాంటి తమిళ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపును అందుకుంది మాళవిక మోహనన్. గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ మంచి మార్కులు అందుకున్న ఆమె, తాజాగా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీలో చాన్స్ అందుకుందట. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, మారుతి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలో అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రానున్న ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాళవికను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించే ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. ముగ్గురు హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో నటించబోతున్నారట. అందులో ఒకరిగా మాళవికను ఫైనల్ చేసినట్టు టాక్. ఎప్పటికప్పుడు గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలతో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే ఆమె, ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో నటించింది. టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీలో అవకాశం రావడమంటే గోల్డెన్ చాన్స్ అందుకున్నట్టే. ఈ ప్యాన్ ఇండియా మూవీతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన స్థాయి మరింత పెరిగే అవకాశముంది. ఇక ప్రస్తుతం ‘యుద్ర’ అనే బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీలో నటిస్తోంది మాళవిక. ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి జంటగా ఆమె నటించిన ‘మారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఈనెలలోనే ఓటీటీలో విడుదల కానుంది.