శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొందరు కంత్రీగాళ్లు  మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో కన్నింగ్ వేషాలు వేస్తూ గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్  పోర్టులో దుబాయ్  నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన 5.5 కేజీల బంగారాన్ని  కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి లోదుస్తులలో దాచి అక్రమంగా బంగారాన్ని తలిచేందుకు  కేటుగాళ్లు యత్నంచారు. 

దుబాయ్ నుంచి వస్తున్న అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ఇద్దరు ప్రయాణికుల ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో  కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.బంగారం అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలపై కూపీ లాగుతున్నారు.