
ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా – ఫ్రాన్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరుగుతోంది. 22వ నిమిషంలో పెనాల్టీ షూట్ అవుట్ లో ‘మెస్సీ’ తొలి గోల్ సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అనంతరం అర్జెంటీనా ఆటగాడు డి మేరియా మరో గోల్ చేశారు. దీంతో ఫ్రాన్స్ పై అర్జెంటీనా 2 – 0 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒత్తిడిలోకి జారుకున్న ఫ్రాన్స్ ను స్టార్ ఆటగాడు ఎంబాపే 2 వరుస గోల్స్ తో ఆదుకున్నాడు. మ్యాచ్ 79వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్ ను ఎంబాపే గోల్ గా మలిచాడు. అనంతరం మరో రెండు నిమిషాల్లోపే ఎంబాపే రెండో గోల్ కూడా చేసి అదుర్స్ అనిపించాడు. దీంతో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల స్కోర్ 2 –2 పాయింట్లతో సమమైంది. మ్యాచ్ సెకండ్ హాఫ్ ముగిసే సమయానికి రెండు టీమ్ లు సమ స్కోర్లతో ఉన్నాయి.