కరోనా నియంత్రణకు సంప్రదాయ ఔషధాలకు పెద్దపీట వేశాం

 కరోనా నియంత్రణకు సంప్రదాయ ఔషధాలకు పెద్దపీట వేశాం

రెండవ గ్లోబల్‌ కోవిడ్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత పటిష్టంగా నిర్మించుకోవడానికి డబ్ల్యూహెచ్‌ఓని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కీల​క పాత్ర పోషించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. 

భవిష్యత్తులో ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. కోవిడ్‌ మహమ్మారి విషయంలో భారత్‌ సమిష్టి కృషితో వైరస్ ను అరికట్టగలిగామని చెప్పారు. వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించామని చెప్పారు. భారత్‌ డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్‌లను తయారు చేయడమే కాకుండా ఐదు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని అన్నారు. 

98 దేశాలకు 200 మిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌లను సరఫరా చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స పొందేలా సరికొత్త వైద్యా విధానాన్ని అభివృద్ధి చేశామన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సంప్రదాయ ఔషధాలకు పెద్దపీట వేశామన్నారు. 

Last month we laid the foundation of WHO Centre for Traditional Medicine in India with an aim to make this age-old knowledge available to the world. It is clear that a coordinated global response is required to combat future health emergencies: PM at the 2nd Global Covid Summit

మరిన్ని వార్తల కోసం..

రూ.100 కోట్ల భూమిని టీఆర్ఎస్ కు అప్పనంగ ఇచ్చిన్రు

ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం