అటల్ పెన్షన్ యోజన...ఎంత కడితే ఎంత పొందవచ్చు

అటల్ పెన్షన్ యోజన...ఎంత కడితే ఎంత పొందవచ్చు

అటల్ పెన్షన్ యోజన (APY)..ఇది ఒక పెన్షన్ పథకం. ఈ పథకంలో చేరిన చందాదారులు 60 సంవత్సరాల వయస్సు నుంచి పింఛన్ పొందొచ్చు. దీని ద్వారా నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం కోసం ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.

ఎంత పెట్టుబడి పెట్టాలి..

అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 2015లో ప్రారంభించారు. ఈ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)చే నిర్వహించబడుతుంది. APY పథకం కింద చందాదారులు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత స్థిరమైన పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఇది వారి వృద్ధాప్యంలో  సహాయపడే పెన్షన్ ప్లాన్‌.  ఈ పథకం కింద ఒక వ్యక్తి నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000  కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా కచ్చితమైన పెన్షన్ ను పొందవచ్చు. కాంట్రిబ్యూషన్ అనేది వ్యక్తి వయస్సు, ఎంచుకున్న నెలవారీ పెన్షన్ పై ఆధారపడి ఉంటుంది. నెలవారీ పెన్షన్ కి ప్రభుత్వం హామీ ఇస్తుంది. APY  కింద సేకరించిన మొత్తాన్ని PFRDA నియమించిన పెన్షన్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వం పేర్కొన్న పెట్టుబడి నమూనా ప్రకారం నిర్వహిస్తుంది.

 
అర్హత ఏంటీ..

అక్టోబర్ 2022 వరకు 18 మరియు 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతదేశ పౌరులందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు. అయితే  అక్టోబర్ 2022లో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన నిబంధనలకు మార్పులు చేసింది. ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్న కూడా ఈ  పెన్షన్ పథకంలో చేరవచ్చు. దరఖాస్తుదారుడు కచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి.బ్యాంకు ఖాతాను కలిగి ఉండి, మొబైల్ నంబర్ ను కలిగి ఉండాలి. 

దరఖాస్తు చేసుకోవడం ఎలా 

అన్ని వివరాలు, పత్రాలు  కలిగి వారు.. బ్యాంకు లేదా పోస్టాఫీస్ ను సంప్రదించాలి. అక్కడ APY రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి. ఆన్ లైన్ ద్వారా కూడా APYలో చేరవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ ఖాతాను ఓపెన్ చేస్తాయి. APY దరఖాస్తు పూర్తి చేశాక.. దానికి  రెండు ఫోటోలు, ఆధార్ కార్డు జత చేసి బ్యాంకు అధికారికి అందించాలి. బ్యాంకులో ఖాతా ఉన్న వారు..APY లో చేరి కాంట్రిబ్యూషన్ లను చెల్లించడం కోసం ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు.

APY ప్రయోజనాలు 

ఈ పథకం చందాదారులకు 60 సంవత్సరాల వయస్సు నుంచి పెన్షన్ ను అందించడంతో పాటు, రూ. 1000 నుంచి రూ. 5000 వరకు హామీ ఇచ్చిన పెన్షన్ను అందిస్తుంది. ఒకవేళ చందాదారులు మరణించినట్లైతే, అతని లేదా ఆమె జీవిత భాగస్వామి అదే మొత్తం పెన్షన్ ను అందిస్తారు.  ఒకవేళ జీవిత భాగస్వామి కూడా మరణించినట్లైతే, నామినీ కార్పస్ డబ్బును పొందేందుకు అర్హులు. అయితే 60 ఏళ్ల  వయస్సు లోపే చందాదారుడులు చనిపోయినట్లైతే, వారి జీవిత భాగస్వామి పథకం నుంచి నిష్క్రమించి కార్పస్ మొత్తాన్ని పొందవచ్చు. లేదా చందాదారుల పేరిట మిగిలిన సంవత్సరాల పాటు ఖాతాని కొనసాగించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.