ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై కొత్త రూల్

ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై కొత్త రూల్

కొత్త సంవత్సరంలో బ్యాంకులు కస్టమర్లపై మరింత బాదుడు షురూ చేయబోతున్నాయి. 2020 జనవరి 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై ఆర్బీఐ కొత్త కండిషన్లను అమలులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నెలవారీ ఫ్రీ లిమిట్ దాటి ఏటీఎం ట్రాన్సాక్షన్లు చేసే కస్టమర్లపై వేసే చార్జీలను పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ఏటీఎం ట్రాన్సాక్షన్ల లిమిట్ దాటి.. ఎక్కువ సార్లు మనీ డ్రా చేసే ప్రతిసారీ బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ బాదుడు క్యాష్ ట్రాన్సాక్షన్లతో పాటు, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లపైనా ఉండనుంది. అయితే ఈ పెంపునకు సంబంధించిన వివరాలను బ్యాంకులు తమ కస్టమర్లకు నోటిఫై చేయాల్సి ఉంటుంది.

బాదుడు ఇలా..

  • ప్రతి కస్టమర్‌‌కు తన బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలలో ఐదు ట్రాన్సాక్షన్ల వరకూ ఫ్రీ ఉంటుంది. ఈ ఐదులోకి బ్యాలెన్స్ చెకింగ్, మనీ విత్‌డ్రాయల్స్, మినీ స్టేట్‌మెంట్, పిన్ చేంజ్‌ ఇలా ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే కౌంట్‌లోకి వస్తుంది. అలాగే మెట్రో సిటీల్లో అయితే మూడు అదర్ బ్యాంక్ ఏటీఎం ట్రాన్సాక్షన్లు, నాన్ మెట్రో సిటీల్లో ఐదు అదర్ బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఫ్రీ ఉంటాయి.
  • ఈ కొత్త కండిషన్ ప్రకారం నెలవారీ ఫ్రీ లిమిట్ దాటి.. ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే కస్టమర్ అకౌంట్‌ నుంచి 21 రూపాయల చార్జ్, అదనంగా జీఎస్టీని బ్యాంకు కట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ చార్జ్ రూ.20గా ఉంది.
  • చార్జీల పెంపుపై హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్‌సైట్లలో నోటిఫై చేశాయి.