గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి

గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి

ఈమధ్య గుండెపోట్లు  వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్యకాంలోనే చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. 

తాజాగా గుండెపోటుతో ఆత్మకూరు  సీఐ నాగేశ్వరరావు(46)  మృతి చెందారు. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో  ఆయన ఒక్కసారిగా ఇంట్లో  కుప్పకూలిపోయాడు. వెంటనే  కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అటు విశాఖలో షటిల్ ఆడుతూ సీబీఐ ఇన్స్పెక్టర్  వెంకట శ్రీరామ్ శర్మ  గుండెపోటుతో చనిపోయారు.