
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలను రూపొందించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 1989లో రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, వికలాంగుల కోసం రూపొందించిన 2016 వికలాంగుల హక్కుల చట్టం ఈ వర్గాల ప్రజలకు రక్షణ కవచాలుగా చట్టం ద్వారా రక్షణ పొందే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలపై, వికలాంగులపై దాడులు దౌర్జన్యాలు జరిగినా, భూముల ఆక్రమణ, కుల వివక్షత, వైకల్యం పేరుతో వివక్షత చూపిన వ్యక్తులపై 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం శిక్షించాలి. ఈ వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి.
ఈ చట్టాలపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ సహకార సంఘాల ద్వారా, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా ఈ చట్టాలపై అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రతి నెల 30వ తేదీన ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటుగా వికలాంగుల సంఘాలతో సమావేశాలను నిర్వహించాలి. ఈ చట్టాల గురించి ప్రతి పోలీస్ స్టేషనులో ప్రతి పౌరుడుకి తెలియజేయడంలో భాగంగా వాల్ పెయింటుతో రాయించాలి. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో, ప్రతి వికలాంగుడికి తెలియజేయాలి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు, వికలాంగులైన ఉద్యోగులకు ఆయా శాఖల ద్వారా చట్టాలపై అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కేసులు, వికలాంగుల కేసులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలి.
డాక్టర్.ఈదునూరి. వెంకటేశ్వర్లు, నెక్కొండ