
- ఫ్లెక్సీలు చించేసిన దుండగులు
తొగుట, దౌల్తాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారరథంపై గురువారం రాత్రి ముగ్గురు దుండగులు దాడికి ప్రయత్నించారు. దౌల్తాబాద్ మండలంలోని ముబారశీ పూర్ రహదారి వద్ద నిలిపి ఉన్న ప్రచార రథంపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి ఫ్లెక్సీ చింపేశారు. అద్దం పగులగొట్టారు. ప్రచారం రథం డ్రైవర్బ్యాగరి శివ, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి కేసులు నమోదు
చేయాలని కోరారు.