
బెల్లంపల్లి, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఒకర్ని కొట్టిన వ్యక్తిపై కేసు ఫైల్ చేసినట్టు వన్‌టౌన్ ఏఎస్ఐ తిరుపతి బుధవారం తెలిపాడు. ఆయన వివరాల ప్రకారం.. పట్టణంలోని మధునన్న నగర్ కు చెందిన పల్లెపలని స్వామిని అదే బస్తీకి చెందిన భీమండ్లపల్లి జలపతి మద్యం తాగేందుకు రూ.500 లు ఇవ్వాలని అడిగాడు. స్వామి ఇవ్వకపోవడంతో జలపతి అతని పై దాడి చేశాడు. దీంతోపాటు ఈనెల 13 న అర్ధరాత్రి స్వామి ఇంటికి వెళ్ళిన జలపతి పార పట్టుకొని ఇంటి పైకి ఎక్కి ఇంట్లోకి దిగి దాడి చేశాడు. దీంతో స్వామి కేకలు వేయగా పక్కనే ఉన్న అతని కొడుకు వినోద్ రావడంతో జలపతి పారిపోయాడు. స్వామిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.