దాడి చేసిన ముగ్గుర్ని.. వెంటాడి పట్టుకున్న స్విగ్గీ బాయ్స్

దాడి చేసిన ముగ్గుర్ని.. వెంటాడి పట్టుకున్న స్విగ్గీ బాయ్స్

తాగిన మైకంలో కొందరు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడి చేశారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పై  ముగ్గురు యువకులు దాడికి దిగారు. కిక్ బాక్సింగ్ టైపులో డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసిన యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టు సమాచారం. 

దాడి చేసి పారిపోతున్న యువకులను స్విగ్గీ బాయ్స్ వెంటాడి  సరూర్ నగర్ లో పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. తీవ్రంగా గాయాలపాలైన ప్రవీణ్ కుమార్ ను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.  దాడి చేసే దృశ్యాలను కారులో ఉన్న యువతి ఫోన్ లో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.