కేటీఆర్ క్యాంపు ఆఫీపై దాడి సిగ్గుచేటు : కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామ కృష్ణారావు

కేటీఆర్ క్యాంపు ఆఫీపై దాడి సిగ్గుచేటు : కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామ కృష్ణారావు

మానకొండూర్, వెలుగు: సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీపై  కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామ కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం మా నకొండూర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా అధికారపక్షం ఎమ్మెల్యేలపై దాడి జరుగుతుందని కానీ, ప్రతిపక్ష లీడర్లపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు.

బీజేపీ. ఎమ్మెల్యేలు, ఎంపీల క్యాంప్ ఆఫీసుల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని ఎందుకు డి మాండ్ చేయడం లేదని విమర్శించారు. కేటీ ఆర్ క్యాంపు ఆఫీస్పై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, ఏకపక్షంగా వ్యవహరించి ఆ పేరును పాడుచేసుకోవద్దని సూచించారు.