ట్రైన్​లో వెళ్తుండగా కర్రతో కొట్టి ఫోన్​ చోరీకి యత్నం.. అందుకోబోయి సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్ ​మృతి

ట్రైన్​లో వెళ్తుండగా కర్రతో కొట్టి ఫోన్​ చోరీకి యత్నం.. అందుకోబోయి సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్ ​మృతి

కమలాపూర్, వెలుగు : తొలి ఏకాదశి పండుగ కోసం రైలులో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్​వేర్​ఎంప్లాయ్ ఫోన్​ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి చనిపోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ​మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు, కొడుకు శ్రీకాంత్​(25) ఉన్నారు. వ్యవసాయదారులైన రాములు దంపతులు కష్టపడి శ్రీకాంత్​ను చదివించారు.

వారనుకున్నట్టే చదువు పూర్తి చేసిన శ్రీకాంత్​ హైదరాబాద్​ ఇన్పోసిస్​లో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ జాబ్​సంపాదించాడు. అక్కడే ఉంటున్న శ్రీకాంత్​ తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ ​నుంచి​ బుధవారం శాతవాహన ఎక్స్​ప్రెస్​లో ఖాజీపేటకు బయలుదేరాడు. రష్ ​ఎక్కువగా ఉండడంతో డోర్​ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్​ చూస్తున్నాడు. బీబీనగర్ ​రైల్వేస్టేషన్ ​దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిని కర్రతో కొట్టారు. కింద పడబోతున్న ఫోన్​ను పట్టుకోబోయిన శ్రీకాంత్​ తీవ్ర గాయాలతో చనిపోయాడు.