నేరడిగొండ, వెలుగు : కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. బజార్ హత్నూర్ మండలం బాలాన్ పూర్ గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు మెస్రం ప్రకాశ్ తోపాటు పలువురు నాయకులు శుక్రవారం నేరడిగొండలోని క్యాంప్ ఆఫీస్ లో రాజేందర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. బీజేపీతో ఒరిగేదేమీ లేదని, గ్రామాల్లో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంత్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణ సింగ్, సిరికొండ మండల అధ్యక్షుడు షేక్ ఇమామ్, నాయకులు పాల్గొన్నారు.
