
హైదరాబాద్, వెలుగు : ఆడియో ఎలక్ట్రానిక్స్ తయారీదారు మివీ (అవిష్కరణ్ ఇండస్ట్రీస్), హైదరాబాద్లో తమ నూతన అత్యాధునిక ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ ప్లాంటుతో పాటు ఆర్ & డి సెంటర్ ఉంటుంది. దీని నిర్మాణం కోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇయర్ ఫోన్‌లు, సౌండ్ బార్లు, సిరీస్, గేమింగ్ యాక్సెసరీలతోపాటు అనుబంధ ఉత్పత్తులు డ్రైవర్లు, పీపీబీఏలు, బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచే ఉత్పత్తి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కంపెనీ కో–ఫౌండర్ మిథుల చెప్పారు.