
- 5 వికెట్లతో ఎంగిడి విజృంభణ
మెక్‌కే (ఆస్ట్రేలియా): ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి (5/42) సూపర్ బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కే (78 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88), ట్రిస్టాన్ స్టబ్స్ (87 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 74) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 84 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 రన్స్‌కు ఆలౌటైంది. 23 రన్స్‌కే ర్యాన్ రికెల్టన్ (8), ఐడెన్ మార్‌క్రమ్ (0) ఔటయ్యారు. టోనీ డి జోర్జి (38)తో మూడో వికెట్‌కు 67 రన్స్ జోడించిన బ్రీట్జ్‌కే.. స్టబ్స్‌తో నాలుగో వికెట్‌కు 89 రన్స్ జత చేశాడు.
వియాన్ ముల్డర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఫర్వాలేదనిపించినా.. బ్రెవిస్ (1), సెనురన్ ముతుస్వామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) ఫెయిలయ్యారు. జంపా 3, బార్ట్‌లెట్, ఎలిస్, లబుషేన్ తలా రెండేసి వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 రన్స్‌కే ఆలౌటైంది. దాంతో స్వదేశంలో 200లోపు రన్స్‌కు ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు ఇది వరుసగా నాలుగోసారి. జోష్ ఇంగ్లిస్ (74 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) ఒంటరి పోరాటం చేశాడు.
ఎంగిడి దెబ్బకు టాప్, మిడిలార్డర్ కుప్పకూలింది. కామెరూన్ గ్రీన్ (35) ఓ మాదిరిగా ఆడినా ట్రావిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబుషేన్ (1), అలెక్స్ క్యారీ (13), ఆరోన్ హ్యార్డీ (10), బార్ట్‌లెట్ (8), ఎలిస్ (3), జంపా (3), హేజిల్‌వుడ్ (3 నాటౌట్) నిరాశపర్చారు. నాండ్రీ బర్గర్, ముతుస్వామి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఎంగిడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే ఆదివారం ఇదే వేదికపై జరుగుతుంది.