
బ్రిస్బేన్: మిడిలార్డర్ బ్యాటర్ రాఘవి బిస్త్ (93), వీజే జోషిత (51) దీటుగా పోరాడటంతో.. ఆస్ట్రేలియా–ఎ విమెన్స్‌తో జరుగుతున్న అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ విమెన్స్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. రాధా యాదవ్ (33), మిన్ను మణి (28) కూడా ఓ చేయి వేయడంతో.. శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 89.1 ఓవర్లలో 299 రన్స్‌కు ఆలౌటైంది. 93/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా ఇన్నింగ్స్‌ను రాఘవి కీలక భాగస్వామ్యాలతో ఆదుకుంది.
జార్జియా ప్రెస్ట్‌విడ్జ్, బ్రౌన్ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 158/5 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఆట ముగిసే టైమ్‌కు నికోల్ ఫాల్టుమ్ (30 బ్యాటింగ్), సియానా జింజెర్ (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.