
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు 12 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 61/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 295 రన్స్‌కు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71) టాప్ స్కోరర్. ఉస్మాన్ ఖవాజ (47)తో మూడో వికెట్‌కు 24 రన్స్ జోడించిన స్మిత్ చివర్లో కమిన్స్ (36)తో ఎనిమిదో వికెట్‌కు 54, టాడ్ మర్ఫి (34)తో తొమ్మిదో వికెట్‌కు 49 రన్స్ జత చేశాడు. అయితే మిడిలార్డర్‌లో లబుషేన్ (9), ట్రావిస్ హెడ్ (4), మిచెల్ మార్ష్ (16), అలెక్స్ క్యారీ (10), మిచెల్ స్టార్క్ (7) నిరాశపర్చారు. ఇంగ్లిష్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, బ్రాడ్, వుడ్, రూట్ తలా రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 రన్స్‌కు ఆలౌటైంది.