యాషెస్ టెస్టు సిరీస్‌ : స్టోక్స్ సెంచరీ వృధా.. సొంత గ‌డ్డపై ఇంగ్లండ్ ఓటమి

యాషెస్ టెస్టు సిరీస్‌ : స్టోక్స్ సెంచరీ వృధా..  సొంత గ‌డ్డపై ఇంగ్లండ్  ఓటమి

యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ స్మిత్ (110) మరో సెంచరీతో చెలరేగాడు. ఆ తరువాత  ఇంగ్లాండ్ 325 పరుగులు చేయగలిగింది. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 279 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 327 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 43 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.   రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెంచరీ (155) తో పోరాడినా లాభం లేకుండా పోయింది .  114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు అదనంగా మరో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో స్టోక్స్‌తో పాటు బెన్‌ డకెట్‌(83) రాణించాడు.  

 రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆస్ట్రేలియా బౌలర్ చెల్ స్టార్క్ 6 వికెట్లు తీయగా, జోష్ హేజిల్‌వుడ్ 5 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ తరఫున స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆలీ రాబిన్‌సన్‌, జోష్‌ టంగ్‌ చెరో 5 వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. క ఇరు జట్లు మధ్య మూడో టెస్టు 2023  జూలై 6 నుంచి లీడ్స్‌ వేదికగా జరగనుంది.