NZ vs AUS 1st T20: నరాలు తెగే ఉత్కంఠ..చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిచిన ఆస్ట్రేలియా

NZ vs AUS 1st T20: నరాలు తెగే ఉత్కంఠ..చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిచిన ఆస్ట్రేలియా

టీ20 క్రికెట్ అంటే ఆ మజానే వేరు. బౌండరీల హోరుతో పాటు థ్రిల్లింగ్ మ్యాచ్ లు అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తాయి. తాజాగా న్యూజి లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 నరాలు తెగే ఉత్కంఠను తలపించింది. నువ్వా నేనా అంటూ సాగిన పోరులో చివరి బంతికి ఆస్ట్రేలియా ఫోర్ కొట్టి విజయం సాధించింది. ఆధ్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ అద్భుత ఆట తీరుతో గెలిచి మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

చివరి ఓవర్ కు 16 పరుగులు కావాల్సిన దశలో సౌథీ వేసిన తొలి మూడు బంతులకు నాలుగు పరుగులే వచ్చాయి. వైడ్ తో సహా మొదటి మూడు బంతులకు నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి మూడు బంతులకు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఆస్ట్రేలియా బ్యాటర్ టిం డేవిడ్ అద్భుతం చేసాడు. నాలుగో బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చాడు. ఐదో బంతికి రెండు పరుగులు రావడంతో చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి వచ్చింది. సౌథీ యార్కర్ మిస్ అవ్వడంతో డేవిడ్ మిడాన్ మీదుగా బౌండరీ రాబట్టి ఆసీస్ కు ఊహించని విజయనాన్ని అందించాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.ఓపెనర్ కాన్వే, టాపార్డర్ బ్యాటర్ రచీన్ రవీంద్ర అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ పై సెంచరీ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ కు భారీ స్కోర్ అందించారు.  కాన్వే 46 బంతుల్లో 2 సిక్సులు, 5 ఫోర్లతో 63 పెరుగు చేస్తే.. రవీంద్ర 35 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్(44 బంతుల్లో 72, 7 సిక్సులు, రెండు ఫోర్లు) అద్భుత హాఫ్ సెంచరీ.. చివర్లో టిం డేవిడ్ మెరుపులు ఆసీస్ జట్టును గెలిపించాయి.