ఆసీస్‌‌‌‌ పాంచ్‌‌‌‌ పటాకా.. సెమీస్‌‌‌‌ రేసులో ముందంజ

ఆసీస్‌‌‌‌ పాంచ్‌‌‌‌ పటాకా.. సెమీస్‌‌‌‌ రేసులో ముందంజ
  • 33 రన్స్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌పై గెలుపు
  • సెమీస్‌‌‌‌ రేసులో ముందంజ

అహ్మదాబాద్: సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారిన సమయంలో ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ ఆస్ట్రేలియా ​అదరగొట్టింది. డిఫెండింగ్​ చాంప్ ఇంగ్లండ్‌‌‌‌ను ఓడిస్తూ టోర్నీలో ఐదో విక్టరీతో సెమీస్‌‌‌‌ రేసులో ముందంజ వేసింది. ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో ఆరో ఓటమితో ఇంగ్లిష్​ టీమ్‌‌‌‌ నాకౌట్‌‌‌‌ నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆడమ్ జంపా (19 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో29; 3/21) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో శనివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్ 33 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలుత  49.3 ఓవర్లో 286 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.

మార్నస్ లబుషేన్ (71) ఫిఫ్టీ కొట్టగా, కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (47), స్టీవ్ స్మిత్ (44), మార్కస్ స్టోయినిస్‌‌‌‌ (35) రాణించారు. చివర్లో జంపా విలువైన రన్స్‌‌‌‌ అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ 4, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253  రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది. బెన్‌‌‌‌ స్టోక్స్ (64), డేవిడ్ మలన్‌‌‌‌ (50), బట్లర్ (42), క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ద మ్యాచ్ జంపాకు తోడు స్టార్క్, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.