చైనా, డబ్ల్యూహెచ్ఓ పాత్రపై దర్యాప్తు చేయాలి

చైనా, డబ్ల్యూహెచ్ఓ పాత్రపై దర్యాప్తు చేయాలి

ఆస్ట్రేలియా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులెవరన్న దానిపై ఇండింపెండెట్ ఎంక్వైరీ కి ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) పాత్రపైన దర్యాప్తు చేయాల్సిందేనని కోరింది. కరోనా తొలి కేసులు నమోదైనప్పుడే చైనా ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిందా లేదా అన్న దానిపై నిజనిజాలు తెలియాల్సి ఉందని ఆస్ట్రేలియా ఫారెన్ మినిస్టర్ మారిస్ పేన్ అన్నారు. ” వైరస్ పుట్టుక తో పాటు దాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించిన వ్యుహాలు, సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్న వివరాలు తెలియాలి. ఇది ఇండింపెండెంట్ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది” అని ఆమె అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోనూ చర్చించామని చెప్పారు. ఇప్పటికే చైనా, డబ్ల్యూహెచ్ఓ పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే డిమాండ్ చేశారు. దీంతో చైనా, డబ్ల్యూహెచ్ఓ లపై ఒత్తిడి మొదలైంది. అటు కరోనా చైనాలో వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనే ఆ దేశం నుంచి విమానాలపై నిషేధం విధించామని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. మా నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కోరినప్పటికీ పట్టించుకోలేదని అదే ఇప్పుడు ఆస్ట్రేలియాను కరోనా బారి నుంచి కాపాడిందని ఆయన అన్నారు.