IND vs AUS: రెండో వన్డేలో ఇండియా బ్యాటింగ్.. మూడు మార్పులతో ఆస్ట్రేలియా

IND vs AUS: రెండో వన్డేలో ఇండియా బ్యాటింగ్.. మూడు మార్పులతో ఆస్ట్రేలియా

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గురువారం (అక్టోబర్ 23) రెండో వన్డే ప్రారంభమైంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ  వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది అలెక్స్ క్యారీ, బార్ట్ లెట్, ఆడమ్ జంపా తుది జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్