IND vs AUS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

IND vs AUS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉదయం నుంచి కమ్ముకున్న మబ్బులు పోయి ఎండ రావడంతో ప్లేయర్లంతా గ్రౌండ్ కి చేరుకున్నారు. ఎంపైర్లు పిచ్ ని పరిశీలించి మ్యాచ్ జరగటానికి ఓకే చెప్పారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో వచ్చింది. రోహిత్ హాజరుతో ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టారు. శార్ధూల్ ఠాకూర్ బదులుగా అక్షర్ పటేల్ ని తీసుకున్నారు. ఆసీస్ ఇంగ్లిస్ బదులు, అలెక్స్ క్యారీని, మ్యాక్స్ వెల్ బదులు నాథన్ ఎల్లిస్ ని జట్టులోకి తీసుకుంది.  

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(c), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(wk), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ