ఆ ఒక్క ఓటమే కొంపముంచింది: టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన భారత్

ఆ ఒక్క ఓటమే కొంపముంచింది: టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన భారత్

కేప్ టౌన్ లో టెస్టులో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న భారత్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ ను కోల్పోయింది. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ర్యాంకింగ్స్ లో ముందుకు వెళ్తారు. కానీ టీమిండియా మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ లో జరిగిన టెస్టులో రోహిత్ సేన ఓడిపోవడం ప్రతికూలంగా మారింది. పాకిస్థాన్ పై ఇప్పటికే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.

పాక్ పై ఆసీస్ సొంతగడ్డపై పెర్త్, మెల్ బోర్న్ టెస్టుల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్టులో ఆసీస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. టాప్ ర్యాంక్ లో ఆస్ట్రేలియా ఖాతాలో 118 రేటింగ్‌ పాయింట్స్ ఉన్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ను 1-1 గా ముగించిన భారత్ 117 పాయింట్లతో సరిపెట్టుకుంది. 115 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా(106) ,న్యూజి లాండ్(95),పాకిస్థాన్(92), శ్రీలంక(79),వెస్టిండీస్(77) వరుసగా 4,5,6,7,8 స్థానాల్లో నిలిచాయి. 

వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికి కాస్తే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ లో భారత స్పిన్నర్ అశ్విన్ తన టాప్ ర్యాంక్ ను నిలుపుకోగా.. ఆల్ రౌండర్లలో జడేజా అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు.