IND vs AUS: పరువు కాపాడిన రాహుల్, అక్షర్: టీమిండియా 136 ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 131

IND vs AUS: పరువు కాపాడిన రాహుల్, అక్షర్: టీమిండియా 136 ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 131

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లో నిరాశపరించింది. పెర్త్ వేదికగా ఆదివారం (అక్టోబర్ 19) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ రాణించి ఇండియాకు ఒక మోస్తరు స్కోర్ అందిచారు. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఇండియా 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది, రాహుల్ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజల్ వుడ్, మిచెల్ ఒవేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఎల్లిస్, స్టార్క్ లకు తలో వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. స్టార్క్, హేజల్ వుడ్ బౌలింగ్ ధాటికి ఓపెనర్లు రోహిత్, గిల్ ఇబ్బందిపడ్డారు. కంగారూల పదునైన బౌలింగ్ ధాటికి మన ఓపెనర్లు తడబడ్డారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులకే చేసి ఔటయ్యాడు. హేజల్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ లి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ పరుగుల ఖాతా తెరవడానికి ఇబ్బందిపడ్డాడు. తొలి 6 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని కోహ్లీ ఒత్తిడిలో పాయింట్ దిశగా షాట్ ఆడి క్యాచ్ ఇచ్చాడు. ఎల్లిస్ తన తొలి ఓవర్లోనే గిల్ ను ఔట్ చేసి ఇండియాను కష్టాల్లో పడేశాడు. 

కాసేపటికే ఇండియా వెంటనే శ్రేయాస్ అయ్యర్ వికెట్ ను కోల్పోయింది. హేజల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయాస్ ఔటయ్యాడు. 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియాను అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (36) ఆదుకున్నారు. ఐదో వికెట్ కు స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. అక్షర్ 31 పరుగులు చేసి ఔటైనా.. సుందర్ తో రాహుల్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (19) రెండు సిక్సర్లు కొట్టడంతో ఇండియా స్కోర్ 136 పరుగులకు చేరింది. వర్షం కారణంగా ఆస్ట్రేలియా టార్గెట్ ను 131 పరుగులకు సవరించారు.