
ఇండోర్: విమెన్స్ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా అజేయ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆష్లే గార్డ్‌నర్ (104 నాటౌట్) సెంచరీకి తోడు అనాబెల్ సదర్లాండ్ (98 నాటౌట్; 3/60) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోవడంతో మెగా టోర్నీలో ఐదో విజయం సాధించింది. సౌతాఫ్రికాను వెనక్కునెట్టి తిరిగి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 244/9 స్కోరు మాత్రమే చేసింది. టామీ బ్యూమోంట్ (78) సత్తా చాటింది. ఆసీస్ సీమర్ సదర్లాండ్ మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. స్పిన్నర్లు సోఫీ మోలినుక్స్ (2/52), అలానా కింగ్ (1/20) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ నియంత్రించారు. అనంతరం ఆసీస్ 40.3 ఓవర్లలోనే 248/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. స్టార్టింగ్‌లో లిచ్‌ఫీల్డ్ (1), జార్జియా వోల్ (6), ఎలీస్ పెర్రీ (13), బెత్ మూనీ (20) ఫెయిలవడంతో కంగారూ టీమ్ ఓ దశలో 68/4తో ఇబ్బందుల్లో పడింది. కానీ, గార్డ్‌నర్, సదర్లాండ్ ఐదో వికెట్‌కు అజేయంగా 180 రన్స్ భారీ పార్ట్‌నర్‌షిప్‌తో జట్టును గెలిపించారు. సదర్లాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.