యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ విక్ట‌రీ

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ విక్ట‌రీ

యాషెస్ సిరీస్ ను గ్రాండ్ గా మొదలు పెట్టింది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టులు సిరీస్ లో భాగంగా.... 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఇచ్చిన 20 పరుగుల స్వల్వ టార్గెట్ ను ఆతిథ్య జట్టు వికెట్ కోల్పొకుండా. 5.1 ఓవర్ లో చేధించింది.  అంతకముందు మూడో రోజు ఆట ముగిసే టైంకి 2 వికెట్లకు 220 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్...నాలుగో రోజు ఆట తొలి సెషన్ లో తేలిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్  73వ ఓవర్లో జట్టు స్కోరు 223 పరుగులు ఉన్నప్పుడు.. 82 పరుగుల చేసిన మలాన్  ఔట్  కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. అక్కడి నుంచి ఏ టైంలోనూ ఇంగ్లండ్  కోలుకోనివ్వలేదు ఆసీస్ బౌలర్లు.  కేవలం 74 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. ఆసీస్  బౌలింగ్ లో నాథన్  లియోన్  4, కామెరాన్  గ్రీన్ , పాట్ కమిన్స్  చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్ , హాజిల్ వుడ్  తలా ఒక వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో ట్రెవిస్  హెడ్  152 పరుగులతో మెరిశారు. ఓపెనర్  డేవిడ్  వార్నర్  94 పరుగులు, లబుషేన్ 74 పరుగులతో రాణించడంతో 425 పరుగుల భారీ స్కోరు చేసింది.  

400 వికెట్ల క్ల‌బ్‌లో నాథ‌న్ లియ‌న్‌

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లియ‌న్ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.  డేవిడ్ మ‌ల‌న్‌ను ఔట్ చేయ‌డంతో 34 ఏళ్ల నాథ‌న్ లియ‌న్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా త‌ర‌పున లియ‌న్ 101వ‌ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెట‌ర్ల‌లో లియ‌న్ 16వ బౌల‌ర్‌ కావ‌డం విశేషం. ఇక ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌లో షేన్ వార్న్‌, గ్లెన్ మెక్‌గ్రాత్ త‌ర్వాత ఆ జాబితాలో చేరాడు. అయితే నాథ‌న్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇండియాపై ఉంది. 2017లో బెంగుళూరులో జ‌రిగిన టెస్టులో లియ‌న్ 50 ర‌న్స్ ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో శ్రీలంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ అత్య‌ధికంగా 800 వికెట్లు తీశాడు. ఆ త‌ర్వాత స్థాన‌ల్లో షేన్ వార్న్ (708), ఇండ్లండ్ స్పీడ్ బౌల‌ర్ జిమ్మీ అండ‌ర్స‌న్ (632), స్టువ‌ర్ట్ బ్రాడ్ (524) ఉన్నారు.