
పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఆదివారం (అక్టోబర్ 19) ఎన్నో అంచనాలతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తన తొలి వన్డే మ్యాచ్ ఆడనుండడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇండియా ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్‌తో యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఏడు నెలల గ్యాప్ తర్వాత లెజెండ్స్ రోహిత్, కోహ్లీ (రోకో) తిరిగి ఇండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌లో అడుగు పెట్టడం ఈ సిరీస్‌కు జోష్ తెచ్చింది.
ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రమాదకర ఆటగాళ్లతో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. స్టాండిన్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌నూ తక్కువగా అంచనా వేయడానికి లేదు. పైగా సొంతగడ్డపై ఆసీస్‌ను పడగొట్టడం అంత ఈజీ కాబోదు. ఇండియా అనగానే రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఆ టీమ్‌కు అతి పెద్ద బలం. ఈ మ్యాచ్‌తో రెన్‌షా, ఓవెన్ వన్డే అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్, ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయాలతో దూరం కాగా, ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్