ట్రైనింగ్ ఇస్తే.. 25 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఊడగొట్టింది!

 ట్రైనింగ్ ఇస్తే..  25 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఊడగొట్టింది!

అన్ని రంగాల్లో దూసుకెళ్తోన్న ఏఐని ఆస్ట్రేలియాలోని ఓ బ్యాంక్‌‌‌‌ కూడా వాడాలని నిర్ణయించుకుంది. కానీ.. ఏఐ తమకు కావాల్సినట్టు పనిచేయాలంటే ముందుగా దానికి ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వాలి. అందుకే ఆ బ్యాంకులో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 63 ఏళ్ల క్యాథరిన్‌‌‌‌తోపాటు మరికొంతమందికి ఆ పనిని అప్పగించారు. వాళ్లు కూడా తాము చేసే పనులన్నీ ఏఐకి నేర్పించారు. 

ఎంతో జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చారు. సీన్ కట్‌‌‌‌ చేస్తే.. యాజమాన్యం ట్రైనింగ్ ఇచ్చినవాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. మేం ఏం తప్పు చేశామని అడిగితే.. వాళ్లు చేసే పనులన్నీ ఏఐ చేస్తుందని, ఇక వాళ్ల సేవలు అవసరం లేదని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఏఐ సింపోజియంలో క్యాథరిన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది. బంబుల్‌‌‌‌బీ అనే ఏఐ చాట్‌‌‌‌బాట్ కోసం స్క్రిప్ట్‌‌‌‌లను రెడీ చేయడంలో, టెస్ట్ చేయడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించింది. కానీ.. తన ట్యాలెంట్ వల్లే ఉద్యోగాన్ని కోల్పోతానని ఏమాత్రం ఊహించలేదు. ‘‘కంపెనీలో పాతికేండ్లు పనిచేసిన నన్ను తొలగిస్తారని అస్సలు అనుకోలేదు” అని తన బాధను పంచుకుంది. 

►ALSO READ | జీవితానికి చేయూత.. రోషిణి